raviteja: 'రాజా ది గ్రేట్' లో ట్రైన్ ఎపిసోడ్ హైలైట్ గా నిలుస్తుందట!

  •  షూటింగ్ ముగింపు దశలో 'రాజా ది గ్రేట్'
  •  చూపులేని వ్యక్తిగా రవితేజ 
  •  రాయఘర్ లో యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ
  •  అక్టోబర్ 12న ప్రేక్షకుల ముందుకు       

'పటాస్' .. 'సుప్రీమ్' సినిమాల హిట్స్ తో దర్శకుడు అనిల్ రావిపూడి మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆయన తదుపరి చిత్రంగా 'రాజా ది గ్రేట్' తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఈ సినిమాకి సంబంధించిన ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ట్రైన్ ఎపిసోడ్ ను రవితేజతో పాటు మరికొందరు ఫైటర్స్ పై చిత్రీకరించనున్నారు.

'రాయఘర్'లో ఈ ఎపిసోడ్ ను చిత్రీకరించడం కోసం ఇప్పటికే టీమ్ అక్కడికి చేరుకుంది. ట్రైన్ తో ముడిపడిన ఈ యాక్షన్ సీన్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. వెరైటీగా యాక్షన్ సీన్స్ ను డిజైన్ చేయించడం అనిల్ రావిపూడి ప్రత్యేకత. ఈ సినిమాలోనూ ఆయన అదే చేయబోతున్నారు. మెహ్రీన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను 'దీపావళి' కానుకగా అక్టోబర్ 12న విడుదల చేయనున్నారు.      

More Telugu News