bengaluru: బెంగళూరును టార్గెట్ చేసిన ఉగ్రవాదులు.. కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో అలర్ట్

పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం

విదేశీ రాయబార కార్యాలయాలే మెయిన్ టార్గెట్

ఐసిస్, బంగ్లాదేశ్ ఉగ్రవాదుల నుంచి పెను ముప్పు

ఇండియన్ ఐటీ హబ్ అయిన బెంగళూరును ఉగ్రవాదులు టార్గెట్ చేశారని... ఏ క్షణంలోనైనా దాడులు జరిపే అవకాశం ఉందని కేంద్ర నిఘావర్గాలు హెచ్చరించాయి. దీంతో, బెంగళూరు పోలీసులు అలర్ట్ అయ్యారు. విదేశీ రాయబార కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఐసిస్ తో పాటు, బంగ్లాదేశ్ ఉగ్రవాదులు దేశంలోని వివిధ ప్రాంతాలను టార్గెట్ చేశాయని... దేశ రాజధాని ఢిల్లీ తర్వాత బెంగళూరు వారికి ప్రధాన టార్గెట్ గా ఉందని తెలిపింది. ఇంటెలిజెన్స్ హెచ్చరికలు అందిన వెంటనే... ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పోలీసు ఉన్నతాధికారులతో కీలక భేటీ నిర్వహించారు. మరోవైపు, కర్ణాటకలో 283 మంది బంగ్లాదేశీయులు అక్రమంగా నివసిస్తున్నట్టు గత ఏడాది గుర్తించారు.

బెంగళూరులో స్విట్జర్లాండ్, శ్రీలంక, మాల్దీవులు, ఇటలీ, ఐర్లండ్, మంగోలియా, కెనడా, డెన్మార్క్, జపాన్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇథియోపియా తదితర దేశాలు కాన్సులేట్ జనరల్ కార్యాలయాలు ఉన్నాయి. వీటితో పాటు, అంతర్జాతీయ విమానాశ్రయం, లెక్కలేనన్ని బహుళ అంతస్తుల భవనాలున్నాయి. ఈ సందర్భంగా కర్ణాటక హోం మంత్రి రామలింగారెడ్డి మాట్లాడుతూ, ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

More Telugu News