airports: విమానాశ్రయాల్లో బోర్డింగ్ పాస్ లకు గుడ్ బై!

  • విమానాశ్రయాల్లో ప్రయాణికులకు తప్పనున్న ఇబ్బందులు
  •  బోర్డింగ్ పాస్ స్థానంలో బయోమెట్రిక్ ఎక్స్ ప్రెస్ చెకిన్ విధానం 
  •  17 విమానాశ్రయాలలో హ్యాండ్ బ్యాగేజ్ ట్యాగ్ విధానానికి స్వస్తి

విమానాశ్రయాల్లో ఇప్పటి వరకు అమలవుతున్న బోర్డింగ్ పాస్ విధానానికి ముగింపు పలకాలని విమానయాన భద్రతా ఏజెన్సీలు భావిస్తున్నాయి. దీని స్థానంలో బయోమెట్రిక్ తో కూడిన ఎక్స్ ప్రెస్ చెకిన్ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ కొత్త విధానం వల్ల ఇప్పటిదాకా ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులకు ఫుల్ స్టాప్ పడుతుందని... వారి ప్రయాణం సాఫీగా సాగుతుందని చెబుతున్నారు. ఈ కొత్త విధానం కోసం ఆధునిక సాంకేతిక పరిఙ్ఞానాన్ని వినియోగించుకోవాలని భావిస్తున్నట్టు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ ఓపీ సింగ్ తెలిపారు.

ప్రస్తుతం తాము రెండు విధానాలపై అధ్యయనం చేస్తున్నామని... వీటిలో విమానాశ్రయాల్లో ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ సొల్యూషన్ వ్యవస్థను ప్రవేశపెట్టడం, భద్రతా సంస్థలన్నింటినీ అనుసంధానించడం, బయోమెట్రిక్, వీడియో ఎనలిస్ట్ సిస్టమ్ మొదలైనవి వినియోగించడం వంటిని ఉన్నాయని చెప్పారు. మరోవైపు, ఇటీవలే దేశంలోని 17 విమానాశ్రయాల్లో హ్యాండ్ బ్యాగేజ్ ట్యాగ్ విధానానికి స్వస్తి పలికిన సంగతి తెలిసిందే. 

More Telugu News