ntr: త్రివిక్రమ్ తో సినిమా గురించి ఎన్టీఆర్!

  •  ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ తో
  •  న్యూ లుక్ తో కనిపించనున్న ఎన్టీఆర్
  •  జనవరి చివరిలో సెట్స్ పైకి

ఎన్టీఆర్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'జై లవ కుశ' సిద్ధమవుతోంది. ఈ నెల 21వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ తో కలిసి ఎన్టీఆర్ సెట్స్ పైకి వెళ్లనున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఆ విషయాన్ని గురించి ప్రస్తావించాడు.

ఈ సినిమాలో తనని త్రివిక్రమ్ డిఫరెంట్ లుక్ లో చూపించనున్నట్టు చెప్పాడు. ఆ లుక్ కి తగినట్టుగా తాను మారనున్నానని అన్నాడు. త్రివిక్రమ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లే సమయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పాడు. 'జై లవ కుశ'లో ఒకేసారి తెరపై మూడు డిఫరెంట్ లుక్స్ తో కనిపించే ఎన్టీఆర్, ఆ తరువాత సినిమాలో మరో లుక్ తో కనిపించనుండటం ఆయన అభిమానుల్లో ఆసక్తిని పెంచే విషయం. జనవరి 10 న పవన్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చే త్రివిక్రమ్, ఆ నెల 23 .. 24వ తేదీల్లో ఎన్టీఆర్ సినిమాను మొదలెట్టనున్నాడు.    

More Telugu News