amitsha: ‘ఈశాన్య రాష్ట్రాల్లో జపాన్ పెట్టుబడులపై చైనా అభ్యంతరం’పై స్పందించిన అమిత్ షా

భార‌త ఈశాన్య రాష్ట్రాల్లో విద్యుత్‌, రోడ్ల నిర్మాణ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ ముందుకు వ‌చ్చిన నేపథ్యంలో చైనా నిన్న ప‌లు వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఆ ప్రాంతంలో సరిహద్దు వివాదాలు ఉన్నాయ‌ని, థ‌ర్డ్ పార్టీ జోక్యం ఉండ‌కూడ‌ద‌ని పేర్కొంది. ఈ విష‌యంపై స్పందించిన భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా చైనాపై ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. దేశ సరిహద్దుల్లో అభివృద్ధి చేసుకునే సార్వభౌమాధికారం భార‌త్‌కి ఉందని వ్యాఖ్యానించారు. దేశ‌ విధానాన్ని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఇప్ప‌టికే స్పష్టంగా చెప్పారని, వెన‌క్కి త‌గ్గేది లేద‌ని చెప్పారు. భార‌త్ త‌న‌ హక్కుల‌ను వినియోగించుకుంటుంద‌ని తెలిపారు. 

More Telugu News