ntr: ఈ సినిమాలో ‘జై’ పాత్ర కోసం చాలా కష్టపడ్డా: ఎన్టీఆర్

  •  జై ల‌వ‌కుశ కథ నాకు బాగా నచ్చింది
  • దర్శకుడు బాబీకి మంచి ల‌క్ష్యం ఉంది
  • ఈ సినిమాలోని నా పాత్రలు చాలా నేచుర‌ల్ గా కనపడాలని ప్ర‌య‌త్నించా‌

త‌న కొత్త సినిమాలో అన్నింటికంటే ‘జై’ పాత్ర కోసం ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డ్డాన‌ని యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అన్నాడు. త‌న ‘జై ల‌వ‌కుశ’ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైన నేప‌థ్యంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ తాజాగా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ... ఈ సినిమా ద‌ర్శ‌కుడు బాబీ త‌న‌కు క‌థ చెప్పేట‌ప్పుడు ఆయ‌న‌ను ఓ ర‌చ‌యిత కోణంలోనే చూశాన‌ని, ఆ త‌రువాత ఆయ‌న ద‌ర్శ‌కుడిగా ఈ సినిమా చేయ‌గ‌ల‌డా? అన్న విష‌యాన్ని ప‌రిశీలించాన‌ని అన్నాడు.

ఎన్నో క‌థ‌లు త‌న వ‌ద్ద‌కు వ‌చ్చాయ‌ని, జై ల‌వ‌కుశ క‌థ త‌న‌కు బాగా న‌చ్చింద‌ని ఎన్టీఆర్ చెప్పాడు. ద‌ర్శ‌కుడిగా నిరూపించుకోవాల‌ని బాబీకి ఓ ల‌క్ష్యం ఉంద‌ని, త‌న‌కు కూడా మంచి సినిమాలు చేయాల‌ని ల‌క్ష్యం ఉంద‌ని అన్నాడు. సినిమాల్లో త‌న‌కు క‌థే ముఖ్య‌మ‌ని అన్నారు. ‘జై ల‌వ‌కుశ’లో డిఫెరెంట్ పాత్ర‌ల్లో న‌టించాన‌ని, ఎంతో నేచుర‌ల్ గా ఉండాల‌ని ప్ర‌య‌త్నించాన‌ని అన్నాడు. ‘జై’ పాత్రలో నటించేటప్పుడు విలనిజం తగ్గకూడదన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నటించానని చెప్పాడు. 

ntr

More Telugu News