kohli: స్ట‌న్నింగ్ క్యాచ్ ప‌ట్టి కోహ్లీని వెన‌క్కి పంపిన మ్యాక్స్‌వెల్ వీడియో!

  • టీమిండియా స్కోరు 20 ఓవ‌ర్ల‌కి  84/4
  • 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్ శ‌ర్మ ఔట్

చెన్నైలో జ‌రుగుతోన్న టీమిండియా, ఆస్ట్రేలియా మొద‌టి వ‌న్డే మ్యాచులో టీమిండియా వెంట వెంటనే మూడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డ్డ విష‌యం తెలిసిందే. ర‌హానే, కోహ్లీ, మ‌నీష్ పాండే అవుట‌య్యాక రోహిత్ శ‌ర్మ కూడా 28 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద అవుట‌య్యాడు. దీంతో టీమిండియా ఒత్తిడిలో ప‌డింది. ప్ర‌స్తుతం క్రీజులో కేదార్ జాదవ్ 39, మ‌హేంద్ర సింగ్ ధోనీ 6 ప‌రుగుల‌తో ఉన్నారు. ఇక‌ ఈ ఇద్ద‌రిపై టీమిండియా అభిమానులు ఆశ‌లు పెట్టుకున్నారు. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో నాథ‌న్ కౌల్టెర్ మూడు వికెట్లు తీయ‌గా మార్క‌స్ స్టోయినిస్ ఒక వికెట్ తీశాడు. ప్ర‌స్తుతం టీమిండియా స్కోరు ఇర‌వై ఓవ‌ర్ల‌కి 84/4 గా ఉంది.

 కాగా, మంచి ఫామ్‌లో ఉన్న‌ విరాట్ కోహ్లీపై అభిమానులు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న విష‌యం తెలిసిందే. అయితే, ఆయ‌న డ‌కౌట్ కావ‌డం అభిమానులను నిరాశ‌లోకి నెట్టింది. కోహ్లీ షాట్ కొట్ట‌డానికి ప్ర‌యత్నించగా ఆస్ట్రేలియా ఆట‌గాడు మ్యాక్స్‌వెల్ అద్భుత‌రీతిలో క్యాచ్ ప‌ట్టి కోహ్లీని వెనుదిరిగేలా చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. మీరూ చూడండి..

More Telugu News