ilaiah: చండాలురు, శూద్రులు, దుర్మార్గులు అంటూ కిందికులాల వారిని ఎందుకు తిట్టారు?: క‌ంచ ఐల‌య్య

  • తన పుస్తకాన్ని గట్టిగా సమర్థించుకున్న ప్రొ.ఐలయ్య
  • చిన్న పుస్త‌కం రాయ‌డంతోనే ఇంతగా విమర్శలా?
  • మరి అగ్రకులాల వారు రాసుకున్న పుస్తకాల మాటేంటి?
  • నా డిమాండ్లను అగ్రకులాల వారు అంగీకరించాలి
  • అప్పుడే నేను రాసిన పుస్తకాన్ని తగలబెడతాను

‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' అంటూ పుస్తకం రాసిన ప్రొ.కంచ ఐల‌య్యకు ఈ రోజు వ‌రంగ‌ల్‌లో ఆఫీస‌ర్స్ ఫోరం స‌న్మానం చేసింది. ఈ సంద‌ర్భంగా జరిగిన ర్యాలీలో ఐల‌య్య మాట్లాడుతూ.. తాను ఇంత చిన్న పుస్త‌కం రాయ‌డంతోనే వారి జాతిని అవ‌మానించాన‌ని అంటున్నార‌ని మండిప‌డ్డారు. త‌మ‌ను అవ‌మానించిన అగ్ర‌కులాల వారిని తాను రోడ్ల‌పైకి తెచ్చినందుకే త‌న‌కు ఈ రోజు స‌న్మానం చేశార‌ని చమత్కరించారు.
 
కింది కులాల వారిని అవ‌మానించబోమ‌ని, తిట్ట‌బోమ‌ని అగ్ర‌కులాల వారు చెప్పి, తన డిమాండ్ల‌ను ఒప్పుకుంటే తాను రాసిన పుస్త‌కాన్ని తానే హైద‌రాబాద్‌లోని సుంద‌ర‌య్య విజ్ఞాన కేంద్రంలో బ‌హిరంగంగా త‌గ‌ల‌బెడ‌తాన‌ని అన్నారు. బ్రాహ్మ‌ణులు రాసుకున్న పుస్తకాల‌లో కిందికులాల వారిని చండాలురు, శూద్రులు, దుర్మార్గులు, జ్ఞానం లేని వారు అని ఎన్నో ర‌కాలుగా తిట్టార‌ని, ఇప్పుడు తాను రాసుకున్న పుస్త‌కంపై ఇంతగా ఎందుకు మండిప‌డుతున్నార‌ని ఆయ‌న నిలదీశారు. చాక‌లోడు, మంగ‌లోడు, ద‌ళితుడు అని తిట్టిన‌ అగ్ర‌కులాల అహంకారం గురించి ఎవరూ మాట్లాడ‌రేంట‌ని ప్రశ్నించారు.

More Telugu News