flip cart: శాంసంగ్, మైక్రోమ్యాక్స్, మోటోతో పాటు పలు బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్‌ లో డిస్కౌంట్లు!

  • ఈ నెల 20 నుంచి 24 వ‌ర‌కు బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్
  • ఈ నెల 21 నుంచి స్మార్ట్‌ఫోన్‌ల‌పై ఆఫ‌ర్లు
  • ఎస్‌బీఐ డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో అదనంగా 10 శాతం డిస్కౌంట్

దేశీయ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌ ఈ నెల 20 నుంచి 24 వ‌ర‌కు ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్’ లో భాగంగా అన్ని ర‌కాల ఉత్ప‌త్తుల‌పై డిస్కౌంట్లు ఇవ్వ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ నెల‌ 21 నుంచి అందులో స్మార్ట్‌ఫోన్‌ల‌పై ఆఫ‌ర్ల‌ను అందుకోవ‌చ్చు. శాంసంగ్‌, మోటో, షోలో, స్వైప్‌, ఆసుస్‌, మైక్రోమ్యాక్స్‌, శాన్‌సుయి వంటి అన్ని ర‌కాల స్మార్ట్‌ఫోన్ల‌పై ఫ్లిప్‌కార్ట్‌ డిస్కౌంట్లు ఇవ్వ‌నుంది. వాటి వివ‌రాల‌ను త‌మ వెబ్‌సైట్లో ఉంచింది.

రూ. 7000 కంటే తక్కువ ధర ఉన్న శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్లపై ఆఫ‌ర్లు అందుకోవ‌చ్చు. శాంసంగ్‌ గెలాక్సీ ఆన్‌5, శాంసంగ్‌ గెలాక్సీ ఆన్‌7, శాంసంగ్‌ గెలాక్సీ జే3 ప్రొలను త‌క్కువ ధ‌ర‌ల‌కే కొనుగోలు చేయ‌వ‌చ్చు. అంతేగాక‌, ఎస్‌బీఐ డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో ఈ ఫోన్ల‌ను కొనుగోలు చేస్తే అద‌నంగా 10 శాతం డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు. అలాగే,  రూ.6,499ల‌ పానసోనిక్‌ పీ85 ఫోన్‌ రూ.4,999కే కొనుగోలు చేయ‌వ‌చ్చు. 7,499 రూపాయల స్వైప్‌ ఎలైట్‌ సెన్స్ ను రూ.5,999 కే పొంద‌వ‌చ్చు. ఇవేకాక ప‌లు బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్‌ల‌పై డిస్కౌంట్లు పొంద‌వ‌చ్చు.

‘బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్’ గురించి ఆ సంస్థ ప్ర‌తినిధి అయ్య‌ప్ప‌న్ రాజ‌గోపాల్ మాట్లాడుతూ... తాము ఇంత‌కు ముందు ఎన్న‌డూ అందించ‌ని విధంగా స్మార్ట్‌ఫోన్‌ల‌పై డిస్కౌంట్ల‌ను అందిస్తున్నామ‌ని చెప్పారు. కాగా, స్మార్ట్ ఫోన్‌ల విక్ర‌యాల్లో త‌మ మార్కెట్‌ను మ‌రింత‌ పెంచుకునేందుకు తాము ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని అన్నారు. ఈ ఆఫ‌ర్ల‌లో భాగంగా శాంసంగ్ బ‌డ్జెట్ ఫోన్‌లే కాకుండా గెలాక్సీ ఎస్‌7 ను కూడా భారీ తగ్గింపు ధ‌ర‌కి తన వినియోగ‌దారులకు అందించ‌నున్న‌ట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. 

More Telugu News