ravi teja: రవితేజ కొత్త సినిమా టైటిల్ ట్రాక్ విడుదల తేదీ ఖరారు!

  • ఎల్లుండి సాయంత్రం 6 గంట‌ల‌కు విడుద‌ల 
  • అభిమానుల స్పందన కోసం ఎదురుచూస్తున్నానన్న దర్శకుడు

మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తోన్న 'రాజా ది గ్రేట్' సినిమా టీజ‌ర్ ఇటీవ‌లే విడుద‌లై అభిమానుల‌ను అల‌రించిన విష‌యం తెలిసిందే. రవితేజ చూపులేని వ్యక్తిగా క‌న‌ప‌డుతూ ఫైటింగ్ చేస్తూ చెప్పిన డైలాగులు ఈ సినిమాపై ఆసక్తిని క‌లిగించాయి. దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రూపొందుతోన్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వ‌హిస్తున్నాడు.

ఈ రోజు అనిల్ రావిపూడి త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా ఈ సినిమాపై స్పందిస్తూ ఓ ప్ర‌క‌ట‌న చేశాడు. ఈ సినిమా టైటిల్ ట్రాక్‌ను ఎల్లుండి సాయంత్రం 6 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చెప్పాడు. అభిమానుల స్పంద‌న కోసం ఎదురుచూస్తూ ఉన్నాన‌ని పేర్కొన్నాడు. ర‌వితేజ విభిన్న పాత్రలో ఈ సినిమాలో న‌టిస్తుండ‌డం ప‌ట్ల ఆయ‌న అభిమానులు ఆస‌క్తి చూపుతున్నారు. 

More Telugu News