minnions: `జిమ్మిక్కి క‌మ్మల్‌` పాట‌కు స్టెప్పులు వేసిన మినియ‌న్స్‌.. వీడియో చూశారా?

మోహ‌న్‌లాల్ న‌టించిన `వెలిపాడిందే పుస్త‌గం` సినిమాలోని `జిమ్మిక్కి క‌మ్మ‌ల్‌` పాట ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. కేర‌ళ, త‌మిళ‌నాడుతో పాటు, ముంబై, న్యూయార్క్‌లలో ఉంటున్న భార‌తీయులు ఈ పాట‌కు స్టెప్పులు వేసి, ఆయా వీడియోల‌ను యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తున్నారు. ఇదే దారిలో ఈ పాట‌కి సంబంధించిన‌ మ‌రో కొత్త వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

ఇందులో ఈ పాట‌కు డ్యాన్స్ చేసింది మ‌రెవ‌రో కాదు... మినియ‌న్లు. `జిమ్మిక్కి క‌మ్మ‌ల్ మినియ‌న్ వెర్ష‌న్‌` అనే పేరుతో ఉన్న ఈ వీడియోలో పొట్టి పొట్టి మినియ‌న్లు, ముద్దులొలికే స్టెప్పుల వేయ‌డం చూడొచ్చు. నిజానికి ఇది వేరే పాటకు వేసిన డ్యాన్స్ అయినా `జిమ్మిక్కి క‌మ్మ‌ల్` బీట్ల‌కు క‌రెక్టుగా స‌రిపోయేలా సింక్ చేశారు.

More Telugu News