google. payment service: గూగుల్ పేమెంట్ సేవ `తేజ్‌`ను ఆవిష్క‌రించ‌నున్న అరుణ్‌జైట్లీ

  • స్ప‌ష్టం చేసిన ఆర్థిక మంత్రిత్వ శాఖ‌
  • భార‌త చెల్లింపు సేవ‌ల్లోకి గూగుల్ ఎంట్రీ
  • `తేజ్‌` అంటే హిందీలో `వేగం` అని అర్థం

గూగుల్ ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెడుతున్న యునిఫైడ్ పేమెంట్స్ ఇంట‌ర్‌ఫేస్ ఆధారిత చెల్లింపు సేవ `తేజ్`ను సోమ‌వారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆవిష్క‌రించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఢిల్లీలో జ‌ర‌గ‌నున్న కార్య‌క్ర‌మంలో అరుణ్ జైట్లీ పాల్గొన‌నున్న విష‌యాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించింది. ఇటీవ‌ల‌ బాగా ప్రాచుర్యంలోకి వ‌చ్చిన డిజిట‌ల్ చెల్లింపుల‌ను ప్రోత్స‌హించేందుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంది. ఇందులో భాగంగానే గూగుల్ చెల్లింపుల సేవ‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డాన్ని ప్ర‌భుత్వం స్వాగ‌తిస్తోంది.

`తేజ్‌` అంటే హిందీలో `వేగం` అని అర్థం. దీని ద్వారా డిజిట‌ల్ చెల్లింపుల‌ను వేగంగా చేసుకునే స‌దుపాయం ఏర్పడుతుంది. నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పోరేష‌న్ ఆఫ్ ఇండియా ఆధ్వ‌ర్యంలో యూపీఐ సేవ‌లు ప‌నిచేస్తున్నాయి. త్వ‌ర‌లో వాట్సాప్ కూడా యూపీఐ ఆధారిత సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే.

More Telugu News