prabhudeva: విలన్ గా ప్రభుదేవా కొత్త అవతారం!

  •  పూర్తిగా నటనపై దృష్టి పెట్టిన ప్రభుదేవా
  •  ఆయన తాజా చిత్రంగా 'మెర్క్యురీ'
  •  ప్రభుదేవాను విలన్ గా చూపించనున్న 'పిజ్జా' దర్శకుడు
  •  ఫ్యాన్స్ లో పెరుగుతోన్న ఆసక్తి  

తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో నృత్య దర్శకుడిగా .. నటుడిగా దర్శకుడిగా .. నిర్మాతగా ప్రభుదేవా రాణించారు. ఆ మధ్య బాలీవుడ్ కి వెళ్లి అక్కడ వరుసగా సినిమాలను తెరకెక్కించిన ఆయన, మళ్లీ చెన్నై వచ్చి తమిళ సినిమాల్లో నటించడానికి ఎక్కువ ఆసక్తిని చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన 'మెర్క్యురీ' అనే సినిమా చేస్తున్నారు.

కథానాయకుడిగాను ..  కీలకమైన పాత్రల్లోను ఇప్పటివరకూ తెరపై కనిపిస్తూ వచ్చిన ప్రభుదేవా, ఈ సినిమాలో విలన్ గా కనిపించనున్నట్టు సమాచారం. 'పిజ్జా' దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన ప్రభుదేవాను విలన్ గా కొత్త కోణంలో చూపించనున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమా తరువాత మరిన్ని విలన్ పాత్రలు ప్రభుదేవాను వెతుక్కుంటూ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు.       

More Telugu News