c.kalyan: స్థల వివాదం నేపథ్యంలో కోర్టును ఆశ్రయించిన సినీ నిర్మాత సి.కల్యాణ్!

  • కామన్ ప్రాపర్టీని ఆక్రమించేందుకు యజమానులు, కాంట్రాక్టర్ యత్నం
  • న్యాయం కోసం కోర్టును ఆశ్రయించిన కల్యాణ్
  • కేసు నమోదు చేయాలన్న కోర్టు
  • దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ప్రముఖ సినీ నిర్మాత సి.కల్యాణ్ కోర్టు మెట్లెక్కారు. వివరాల్లోకి వెళ్తే, హైదరాబాదులోని జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ సొసైటీ పరిధిలో ఉన్న రోడ్ నెంబర్-5లోని ఫ్లాట్ నంబర్ 31/బిలో టి.శ్రీనివాసులు, టి.విమలాదేవిలకు చెందిన 1182 గజాల స్థలాన్ని జ్యోతి కన్ స్ట్రక్షన్ కు 1998లో డెవలప్ మెంట్ నిమిత్తం ఇచ్చారు. ఆ తర్వాత జీహెచ్ఎంసీ అనుమతులతో అక్కడ 11 ప్లాట్లను నిర్మించారు. ఆ తర్వాత 11 మందికి వాటిని విక్రయించారు. అయితే, నిర్మాణానంతరం మిగిలిపోయిన 389 గజాల కామన్ ప్రాపర్టీని కాజేసేందుకు కాంట్రాక్టర్ యత్నిస్తున్నారంటూ కల్యాణ్ కోర్టును ఆశ్రయించారు.

జీహెచ్ఎంసీ అనుమతుల్లో చూపిన విధంగా స్థలాన్ని పూర్తిగా ఫ్లాట్ ఓనర్స్ కే పంచాల్సి ఉంది. అయితే, స్థల యజమానులు శ్రీనివాసులు, విమలాదేవిలతో పాటు జ్యోతి కన్ స్ట్రక్షన్స్ అధినేత ఎంవీఎస్ శేషగిరిరావులు మిగిలిన స్థలాన్ని కాజేసేందుకు యత్నిస్తున్నారంటూ కల్యాణ్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు పై ముగ్గురిపై క్రిమినల్ కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News