akhil: అనారోగ్యం నుంచి కోలుకున్న అఖిల్ .. ఢిల్లీలో షూటింగ్!

  •  'హలో' మూవీ చేస్తోన్న అఖిల్ 
  •  షూటింగులో అనారోగ్యం 
  •  వారం తరువాత కోలుకున్న అఖిల్ 
  •  మళ్లీ షూటింగ్ మొదలు

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ 'హలో' అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పైకి వచ్చిన దగ్గర నుంచి .. నాన్ స్టాప్ గా షూటింగ్ చేస్తూనే వస్తున్నారు. దాంతో అఖిల్ కాస్త అనారోగ్యానికి గురయ్యాడట. తప్పనిసరి పరిస్థితుల్లో షూటింగ్ కి వారం రోజుల పాటు బ్రేక్ ఇచ్చారు. ఈ వారం రోజుల పాటు ఇంటిపట్టునే వున్న అఖిల్ కోలుకున్నాడు.

 ఇప్పుడు ఢిల్లీలో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. షూటింగులో జాయినైన అఖిల్ "అనారోగ్యం కారణంగా ఓ వారం రోజుల పాటు బ్రేక్ తీసుకుని మళ్లీ వచ్చేశా. ఇక్కడి ఆహ్లాదకరమైన వాతావరణంలో షూటింగ్ చేస్తున్నందుకు ఆనందంగా వుంది" అంటూ అక్కడ తీసుకున్న సెల్ఫీ ని పోస్ట్ చేశాడు. అఖిల్ జోడీగా కల్యాణి ప్రియదర్శన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను, డిసెంబర్ 22న విడుదల చేయనున్నారు.  

More Telugu News