puri: ఆలోచనలో పడిన పూరీ జగన్నాథ్?

  •   నెక్స్ట్ మూవీ ఆకాశ్ తో అని చెప్పిన పూరీ
  •   తొందరపడొద్దంటున్న సన్నిహితులు
  •   వేరే హీరోతో హిట్ కొట్టమని సలహాలు
  •   ఆలోచనలో పడిన పూరీ  

పూరి జగన్నాథ్ ఎప్పటికప్పుడు చక చకా కథలను అల్లేసి .. అంతే వేగంగా ఆ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుంటాడు. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలు ఆయనని టాప్ డైరెక్టర్ ను చేసినా, ఈ మధ్య కాలంలో ఆయన నుంచి వస్తోన్న సినిమాలు అభిమానులను నిరాశ పరుస్తున్నాయి. హీరోల ఖాతాల్లోకి ఫ్లాపులు వెళుతున్నాయి. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ మూవీ తనయుడు ఆకాశ్ పూరితో చేస్తున్నట్టుగా చెప్పాడు. అందుకు సంబంధించిన కాస్టింగ్ కాల్ కూడా వచ్చింది.

 అయితే ముందుగా ఏ హీరోతోనైనా ఒక హిట్ కొట్టమనీ, ఆ తరువాత సినిమా ఆకాశ్ తో చేయడం మంచిదని సన్నిహితులు చెబుతున్నారట. లేదంటే ఆకాశ్ ఫస్టు మూవీపై ఆ ప్రభావం పడొచ్చునని అంటున్నారట. దాంతో పూరీ ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. మరి ఆయన నెక్స్ట్ మూవీ వేరే హీరోతో ఉంటుందా? ఆకాశ్ తోనే ముందుకు వెళతాడా? అనేది వేచి చూడాలి.   

More Telugu News