rana: రిలీజ్ కి రెడీగా 'నేనే రాజు నేనే మంత్రి' తమిళ వెర్షన్!

  • తెలుగులో సూపర్ హిట్ అయిన 'నేనే రాజు నేనే మంత్రి'
  •  'నాన్ ఆనైయిట్టాల్' టైటిల్ తో తమిళ వెర్షన్
  •  తమిళనాట కలిసిరానున్న రానా క్రేజ్ 
  • ఈ నెల 22న తమిళ వెర్షన్ విడుదల  

వైవిధ్యభరితమైన కథలకు ప్రాధాన్యతనిస్తూ వస్తోన్న రానా, ఇటీవల 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కథ .. కథనాల్లోని కొత్తదనం కారణంగా ఈ సినిమా సూపర్ హిట్ అనిపించుకుంది. భారీ వసూళ్లను సాధించి .. రానా కెరియర్లోనే చెప్పుకోదగినదిగా నిలిచింది.

 తెలుగుతో పాటే తమిళంలోను ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన అది కుదరలేదు. దాంతో ఈ నెల 22వ తేదీన ఈ సినిమా తమిళ వెర్షన్ ను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. 'నాన్ ఆనైయిట్టాల్' అనే టైటిల్ తో ఈ సినిమా తమిళ ప్రేక్షకులను పలకరించనుంది. రానాకి తమిళంలోను క్రేజ్ వుంది. ఇక కాజల్ .. కేథరిన్ అక్కడి ప్రేక్షకులకి బాగా తెలిసిన కథానాయికలు. కనుక తెలుగులో మాదిరిగానే ఈ సినిమా తమిళంలోను హిట్ కొట్టడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. 

More Telugu News