allu arjun: అల్లు అర్జున్ అదే దూకుడు చూపిస్తున్నాడు

  • రెండవ షెడ్యూల్ లో 'నా పేరు శివ'
  •  బన్నీ, అనూ ఇమ్మాన్యుయేల్ పై సీన్స్ 
  • వారాంతాల్లో ముంబైలో మ్యూజిక్ సిటింగ్స్ 
  •  ఏప్రిల్ 27న విడుదల


అల్లు అర్జున్ కథానాయకుడిగా వక్కంతం వంశీ దర్శకత్వంలో 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా రూపొందుతోంది. ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా, ఆల్రెడీ ఫస్టు షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో రెండవ షెడ్యూల్ ను జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్ షూటింగులో అల్లు అర్జున్ తో పాటే అనూ ఇమ్మాన్యుయేల్ కూడా పాల్గొంటోంది.

 ఒకసారి సెట్స్ పైకి వెళితే ఇక షెడ్యూల్స్ మధ్య పెద్ద గ్యాప్ రాకుండా అల్లు అర్జున్ చూసుకుంటూ ఉంటాడు. ఆ స్పీడ్ వల్లనే ఆయన సినిమాలు అనుకున్న సమయానికి ముందుగానే రెడీ అవుతుంటాయి. అలా ఒక వైపున చకచకా షూటింగును కొనసాగిస్తూనే, వీకెండ్ లో ముంబైలో మ్యూజిక్ సిటింగ్స్ జరుపుతున్నారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ - శేఖర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఏప్రిల్ 27న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 

More Telugu News