: ఇక డ్రైవింగ్ లైసెన్స్ కు, ఆధార్ కు లింక్!

పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్స్, మొబైల్ సిమ్ కార్డులు ఇలా ఒక్కొక్క దాన్ని ఆధార్ కార్డుతో అనుసంధానం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ వంతు వచ్చింది. డ్రైవింగ్ లైసెన్స్ ను ఆధార్ తో అనుసంధానించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. త్వరలోనే ఈ ప్రక్రియ మొదలవుతుందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. 'డిజిటల్ హర్యాణా సమ్మిట్ 2017'లో ఆయన మాట్లాడుతూ, ఈ మేరకు వెల్లడించారు. ఇప్పటికే ఈ విషయం గురించి మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించినట్టు తెలిపారు. 

More Telugu News