varun tej: బతుకమ్మ పండుగకు బుల్లితెరపై 'ఫిదా'!

దసరా పండుగకి థియేటర్స్ దగ్గర కొత్త సినిమాల సందడి ఒక రేంజ్ లో ఉంటుంది. ఇక ఆ సమయంలో మంచి సినిమాలను ప్రసారం చేసి, రేటింగ్స్ పెంచుకోవడానికి టీవీ చానల్స్ పోటీపడుతుంటాయి. ఈ కారణంగా అన్ని చానల్స్ లోను ఈ మధ్య కాలంలో ప్రేక్షకులను అలరించిన సినిమాలను వదులుతుంటారు. అలా 'స్టార్ మా' వారు బతుకమ్మ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, 'ఫిదా' సినిమాను ప్రసారం చేయనున్నట్టు సమాచారం.

 ఈ మధ్య కాలంలో వచ్చిన బిగ్గెస్ట్ హిట్స్ లో 'ఫిదా' ఒకటి. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా, తెలంగాణ నేపథ్యంలోని కథతో కొనసాగుతుంది. అంతేకాదు బతుకమ్మ పండుగకి సంబంధించిన సందర్భం ఈ సినిమాలో చోటుచేసుకుంది. అందువలన ఈ సమయంలో ఈ సినిమాను ప్రసారం చేయడమే కరెక్ట్ అని 'స్టార్ మా' వారు భావించినట్టు తెలుస్తోంది.    

More Telugu News