Rashi: సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం!

*  అందాల రాశిఖన్నా తాజాగా గెస్ట్ రోల్ చేయడానికి అంగీకరించింది. రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'రాజా ది గ్రేట్' సినిమాలో అతిథి పాత్రలో నటించడానికి ఈ చిన్నది ఓకే చెప్పింది. 'నా అభిమాన దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న రాజా ది గ్రేట్ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నాను..' అంటూ రాశి పేర్కొంది. తాజాగా ఈ చిన్నది ఎన్టీఆర్ సరసన 'జై లవ కుశ' సినిమాలో నాయికగా నటించింది.
*  నాని, సాయి పల్లవి జంటగా వేణు శ్రీరాం దర్శకత్వంలో రూపొందుతున్న 'ఎంసీఏ' (మిడిల్ క్లాస్ అబ్బాయి) చిత్రం ఓవర్సీస్ ప్రదర్శన హక్కులను బ్లూ స్కై సినిమాస్ సొంతం చేసుకుంది. విదేశాల్లో పలు హిట్ తెలుగు సినిమాలను పంపిణీ చేసిన సంస్థగా బ్లూ స్కై సినిమాస్ కు పేరుంది.  
*  చాలా కాలం తర్వాత మళ్లీ వీవీ వినాయక్, రవితేజ కాంబినేషన్లో ఓ సినిమా రానుంది. వీరి కాంబినేషన్లో ఓ ప్రముఖ నిర్మాత చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. గతంలో వీరిద్దరూ కలసి 'కృష్ణ' చిత్రానికి పనిచేశారు. 

More Telugu News