: భారత్ లో మరో భారీ వ్యాపారానికి తెరతీసిన గూగుల్!

ప్రపంచ ప్రఖ్యాత సెర్చింజన్ గూగుల్ కు భారత్ అత్యంత విలువైన వినియోగదారుడిగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా మన దేశంలో మరో భారీ వ్యాపారానికి గూగుల్ తెరతీసింది. పేమెంట్ యాప్ ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత మన దేశంలో పేమెంట్ యాప్ లకు డిమాండ్ భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో, ఇండియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ పేమెంట్ ఎకోసిస్టమ్ లోకి గూగుల్ అడుగుపెట్టబోతోందని దికెన్.కామ్ వెబ్ సైట్ తెలిపింది. సెప్టెంబర్ 18న ఈ యాప్ ను లాంచ్ చేయనుందని తెలిపింది. ఈ డిజిటల్ పేమెంట్ సర్వీస్ 'తేజ్' పేరుతో రానుందని వెల్లడించింది. తేజ్ అంటే హిందీలో వేగవంతమని అర్థం.

More Telugu News