: రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్న చిరంజీవి?

సినీ రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించి, ఆ తర్వాత 'ప్రజారాజ్యం' పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు మెగాస్టార్ చిరంజీవి. అయితే, ఊహించని విధంగా ప్రజారాజ్యం పార్టీని ఆయన కాంగ్రెస్ లో విలీనం చేశారు. కేంద్ర మంత్రి పదవిని కూడా అధిరోహించారు. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పార్టీ బిక్కచచ్చిపోయింది. ఈ నేపథ్యంలో కూడా ఎంతో ప్రజాభిమానం ఉన్న చిరంజీవి ఆ పార్టీలో క్రియాశీలకంగా కొనసాగడం లేదు. పార్టీ సమావేశాలకు గాని, ఎన్నికల ప్రచారాలకు గాని ఆయన వెళ్లడం లేదు. చివరిసారిగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారు.

రాజకీయాలకు క్రమంగా దూరమవుతున్న సమయంలోనే ఆయన తన 150వ సినిమాలో నటించారు. ప్రస్తుతం 151 చిత్రం షూటింగ్ కు రెడీ అవుతున్నారు. ఇదే సమయంలో ఓ ఆసక్తికర విషయం వెలుగు చూస్తోంది. చిరంజీవి తన రాజకీయ జీవితానికి పూర్తి స్థాయిలో ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారనేదే ఆ వార్త సారాంశం. ఇకపై తన పూర్తి కాలాన్ని ఆయన సినిమాలకే పరిమితం చేస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. 2018 మార్చి నాటికి రాజకీయాలకు ఆయన గుడ్ బై చెబుతారని అంటున్నారు.

More Telugu News