Rakul: సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం!

*  'స్పైడర్' సినిమా పూర్తి చేసిన కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ హిందీ చిత్రం 'ఆయారే' షూటింగ్ కోసం ఢిల్లీ వెళ్లింది. నీరజ్ పాండే దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్నాడు. ఇందులో రకుల్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపిస్తుంది.
*  మంచు విష్ణు మళ్లీ షూటింగులో పాల్గొంటున్నాడు. జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆచారి అమెరికా యాత్ర' సినిమా షూటింగులో ఆమధ్య విష్ణు యాక్సిడెంటుకి గురైన సంగతి విదితమే. కొన్నాళ్ల విశ్రాంతి అనంతరం ఇప్పుడు మళ్లీ ఆ సినిమా షూటింగులో జాయిన్ అయ్యాడు.
*  అక్కినేని కుటుంబానికి చెందిన హీరో సుమంత్ తన తదుపరి చిత్రానికి తాజాగా ఓ థ్రిల్లర్ కథాంశాన్ని ఎంచుకున్నాడు. నూతన దర్శకుడు అనిల్ శ్రీకంఠం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడు. మరోపక్క సుమంత్ నటించిన 'మళ్లీ రావా' చిత్రం విడుదలకు సిద్ధమైంది.   

More Telugu News