: తక్కువ అంచనా వేశాం.. ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబు విస్ఫోటన సామర్థ్యంపై అమెరికా

ఉత్తర కొరియా ఇటీవల పరీక్షించిన హైడ్రోజన్ బాంబు విస్ఫోటన సామర్థ్యం తాము అంచనా వేసిన దానికంటే చాలా ఎక్కువని అమెరికా పర్యవేక్షణ బృందం తెలిపింది. దాని విస్ఫోటన సామర్థ్యం ఏకంగా 250 కిలో టన్నులని పేర్కొంది. 1945లో నాగసాకిపై అమెరికా ప్రయోగించిన అణుబాంబు కంటే ఇది 16 రెట్లు అధికమని వివరించింది. అప్పట్లో ప్రయోగించిన అణుబాంబు 15 కిలో టన్నులు మాత్రమేనని పేర్కొంది.

ఉత్తరకొరియా గత వారం ఆరోసారి అతిపెద్ద అణుపరీక్ష నిర్వహించింది. ఈ పరీక్ష ధాటికి భూమి 6.3 తీవ్రతతో కంపించింది. తాము పరీక్షించిన హైడ్రోజన్ బాంబును క్షిపణి మోసుకెళ్లగలదని ఉత్తర కొరియా ప్రకటించింది. కాగా, నార్త్ కొరియా పరీక్షించిన హైడ్రోజన్ బాంబు సామర్థ్యాన్ని దక్షిణ కొరియా, జపాన్‌లు 160 కిలో టన్నులుగా అంచనా వేశాయి. అయితే అది తప్పని, దాని సామర్థ్యం 250 కిలోటన్నులని అమెరికా పర్యవేక్షణ బృందం స్పష్టం చేసింది.

More Telugu News