: బుక‌ర్ ప్రైజ్ టాప్ 6లో చోటు సంపాదించ‌ని అరుంధ‌తీ రాయ్ న‌వ‌ల‌!

ఆంగ్ల‌ సాహిత్యంలో ఆస్కార్ అవార్డుగా భావించే మ్యాన్ బుక‌ర్ ప్రైజ్ (ఫిక్ష‌న్‌) 2017 పోటీలో టాప్ 6 న‌వ‌లల్లో భార‌త ర‌చ‌యిత్రి అరుంధ‌తీ రాయ్ న‌వ‌ల `ద మినిస్ట్రీ ఆఫ్ అట్‌మోస్ట్ హ్యాపీనెస్‌`కి చోటు ద‌క్క‌లేదు. అమెరిక‌న్ ర‌చ‌యిత దిగ్గ‌జాలు పోటీలో ఉండటంతో ఆమెకు స్థానం ద‌క్క‌లేద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. టాప్ 13 నుంచి టాప్ 6 న‌వ‌ల‌ల‌ను ఎంపిక చేసి మ్యాన్ బుక‌ర్ జ్యూరీ స‌భ్యులు జాబితాను ప్ర‌క‌టించారు.

ఇందులో పాల్ ఆస్ట‌ర్ రాసిన `4321`, ఎమిలీ ఫ్రెడిలిండ్ రాసిన `హిస్ట‌రీ ఆఫ్ వోల్ఫ్స్`, పాకిస్థానీ-యూకే ర‌చ‌యిత మొహిసిన్ హ‌మీద్ రాసిన `ఎగ్జిట్ వెస్ట్‌`, ఫియోనా మోజ్లే రాసిన `ఎల్మెట్‌`, జార్జ్ సాండ‌ర్స్ రాసిన `లింక‌న్ ఇన్ ద బార్డో`, అలీ స్మిత్ రాసిన `ఆట‌మ్‌` న‌వ‌ల‌లు ఉన్నాయి. ఫైన‌ల్ విజేత‌ను అక్టోబ‌ర్ 17న ప్ర‌క‌టించ‌నున్నారు. 1997లో `గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్‌` ర‌చ‌న‌కు అరుంధ‌తీ రాయ్ బుక‌ర్ ప్రైజ్ గెల్చుకున్న సంగ‌తి తెలిసిందే.

More Telugu News