sunil: సినిమా ప్రమోషన్ కి పది రోజులిచ్చిన సునీల్ !

సునీల్ కథానాయకుడిగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో 'ఉంగరాల రాంబాబు' సినిమా తెరకెక్కింది. ఈ నెల 15వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ పై సునీల్ దృష్టి పెట్టాడు. కేవలం ప్రమోషన్స్ కోసమే 10 రోజులను కేటాయించాడు. న్యూస్ చానల్స్ ను .. టీవీ చానల్స్ ను .. వెబ్ సైట్స్ ను .. యూట్యూబ్ చానల్స్ ను కవర్ చేస్తూ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వెళుతున్నాడు.

 సాధ్యమైనంత ఎక్కువమందికి ఈ సినిమా విషయం చేరవేయడానికి ఎంతగానో తపన పడుతున్నాడు. ప్రమోషన్స్ విషయంలో సునీల్ స్పీడ్ .. అంకితభావం చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు. నిజం చెప్పాలంటే ఈ సినిమా సక్సెస్ ఆయనకి ఎంతో అవసరం. ఈ ఏడాదిలో ఆయన ఈ సినిమాతో హిట్ కొడితే, తేలికగా ఊపిరి పీల్చుకున్నట్టు అవుతుంది.    

More Telugu News