shankar: శంకర్ తో అజిత్ మూవీ ఇప్పట్లో లేనట్టే!

కోలీవుడ్ స్టార్ హీరోగా అజిత్ కి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన తాజా చిత్రంగా వచ్చిన 'వివేగం' భారీ విజయాన్ని సాధించింది. దాంతో ఆయన తదుపరి సినిమాపై అభిమానులు ఆత్రుతను చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నెక్స్ట్ మూవీ శంకర్ దర్శకత్వంలో వుండనున్నట్టు ఒక ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం శంకర్ '2.0' సినిమా పనుల్లో బిజీగా వున్నాడు. ఆ తరువాత ఆయన అజిత్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇద్దరి మధ్యా కథా చర్చలు జరిగినట్టుగా కూడా ఓ టాక్ వినిపిస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా అంటే అది తప్పకుండా కొత్త రికార్డులను సృష్టిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇదంతా కేవలం ప్రచారం మాత్రమేననీ, వాళ్లిద్దరి మధ్యా ఎలాంటి కథా చర్చలు జరగలేదనేది తాజా సమాచారం. కాబట్టి ఇప్పట్లో ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా లేనట్టేనని చెప్పుకోవాలి.    

More Telugu News