: పాత రికార్డులు పటాపంచలు... రూ. 1,36,24,495 కోట్లకు భారత స్టాక్ మార్కెట్ విలువ!

గత కొంతకాలంగా పెరుగుతూ వచ్చిన భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచిక బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ ఉదయం మార్కెట్ ప్రారంభమైన తరువాత, నూతన కొనుగోళ్లు వెల్లువెత్తడంతో బెంచ్ మార్క్ సూచికలు దూసుకెళ్లాయి. ఉదయం 11.05 గంటల సమయంలో బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 1,36,24,495 కోట్లకు చేరుకుంది. ఇది మార్కెట్ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డు.

క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్ఈ సెన్సెక్స్ 72 పాయింట్ల లాభంతో 32,231 పాయింట్ల వద్ద కొనసాగుతుండగా, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సెక్టార్లు అర శాతం వరకూ లాభాల్లో నడుస్తున్నాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచిక 16 పాయింట్లు పెరిగి 10,108 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. టాటా పవర్, రిలయన్స్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర కంపెనీలు లాభాల్లో ఉండగా, బీపీసీఎల్, ఐటీసీ, ఎల్ అండ్ టీ, హిందాల్కో తదితర కంపెనీలు నష్టాల్లో నడుస్తున్నాయి.

More Telugu News