లీకుల విషయంలో చరణ్ కాస్త సీరియస్ గానే వున్నాడట!

13-09-2017 Wed 10:22
'సైరా నరసింహా రెడ్డి' సినిమాపై అందరిలో ఆసక్తి పెరగాలంటే, ఈ సినిమాకి సంబంధించిన అన్ని విషయాలను చివరివరకూ సీక్రెట్ గానే ఉంచాలని నిర్మాత చరణ్ .. దర్శకుడు సురేందర్ రెడ్డి భావించారు. అయితే ఈ సినిమాలో ఎవరెవరిని ఏయే పాత్రల కోసం తీసుకున్నారు? ఆ పాత్రల స్వరూప స్వభావాలు ఎలాంటివి? అనే విషయాలు బయటికి వస్తున్నాయి.

తాను సీక్రెట్ గా వుంచమన్న విషయాలు ఎలా బయటికి వస్తున్నాయనే విషయంపై చరణ్ సీరియస్ అయ్యాడట. ఇకపై ఇలాంటి లీకులు బయటికి రాకుండా చూసే పనిని తన సన్నిహితులకు అప్పగించాడని అంటున్నారు. చరణ్ తీసుకున్న నిర్ణయంతో లీకులకు ఇంతటితో బ్రేక్ పడుతుందేమో చూడాలి. ఈ సినిమాలో నయనతార కథానాయిక కాగా .. అమితాబ్ .. జగపతిబాబు .. విజయ్ సేతుపతి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.