: ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యానికి `ఎ ప్ల‌స్` గ్రేడ్ ఇచ్చిన న్యాక్‌!

తెలంగాణ‌లోని ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యానికి నేష‌న‌ల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడేష‌న్ కౌన్సిల్ (న్యాక్‌) గుర్తింపు ల‌భించింది. ఓయూకి `ఎ ప్ల‌స్` గ్రేడ్‌ను న్యాక్ జారీచేసింది. విశ్వ‌విద్యాల‌యంలో పాటించే విద్యా విధానాలు, ఫ‌లితాలు, అధ్యాప‌కులు, ప‌రిశోధ‌నా విభాగాలు, అవ‌స్థాప‌నా సౌక‌ర్యాలు, విద్యార్థుల‌కు అందించే స‌దుపాయాలు వంటి విభాగాల్లో నాణ్య‌తను ప‌రీక్షించి, దాని ఆధారంగా న్యాక్ గుర్తింపును జారీ చేస్తుంది. వీట‌న్నింటిలోనూ ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం `ఎ ప్ల‌స్‌` కేట‌గిరీలో నిలిచింది. వివిధ కాలేజీలు, యూనివ‌ర్సిటీల ప‌నితీరు ఆధారంగా ఎ++, ఎ+, ఎ, బి++, బి+, బి, సి, డి గుర్తింపుల‌ను జారీ చేస్తుంది. ఈ గుర్తింపు వ‌ల్ల విదేశాల్లో, విద్యా సంబంధిత కేంద్రాల్లో, కార్యాల‌యాల్లో ఆయా కాలేజీలు, యూనివ‌ర్సిటీల విద్యార్థుల‌కు ప్ర‌త్యేకంగా గుర్తింపుతో పాటు, యూనివ‌ర్సిటీ గ్రాంట్స్ క‌మిష‌న్ (యూజీసీ) నుంచి విశ్వ‌విద్యాల‌యాల‌కు నిధులు కూడా జారీ అవుతాయి.

More Telugu News