tarun bhaskar: 'పెళ్లి చూపులు' డైరెక్టర్ కి హీరో దొరికేశాడు!

'పెళ్లి చూపులు' సినిమాతో దర్శకుడు తరుణ్ భాస్కర్ తిరుగులేని విజయాన్ని అందుకున్నాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. దాంతో ఆయన తదుపరి సినిమా ఎప్పుడు? .. ఎవరితో? అనే ఆసక్తి అందరిలోను నెలకొంది. ఈ నేపథ్యంలో తన తదుపరి సినిమా స్టార్ హీరోతో ఉండొచ్చని తరుణ్ భాస్కర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

ఆ తరువాత ఆయన నిఖిల్ తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే, 'వెళ్లిపోమాకే'లో కథానాయకుడిగా చేసిన 'విష్వక్ సేన్' తో ఆయన నెక్స్ట్ మూవీ వుండనుందనేది తాజా సమాచారం. ఇది కూడా 'పెళ్లిచూపులు' తరహాలో తక్కువ బడ్జెట్ లోనే తెరకెక్కే సినిమా అని తెలుస్తోంది. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పైనే ఈ సినిమాను నిర్మిస్తారని అంటున్నారు.   

More Telugu News