: గోరంట్ల బుచ్చయ్య చౌదరి నివాసంలో ముద్రగడ!

టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నివాసానికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ వెళ్లారు. అక్కడ ఈ ముగ్గురూ భేటీ అయ్యారు. అయితే, రాజకీయ కారణాల నేపథ్యంలోనే వీరు భేటీ అయినట్టు తెలుస్తోంది. కాపు సామాజికవర్గంలో ఎంతో కొంత పట్టు ఉన్నటువంటి ముద్రగడను, టీడీపీలోకి తీసుకుంటే పార్టీ బలోపేతానికి మరింతగా ఉపయోగపడుతుందనే భావన తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చర్చలు సాగుతున్నట్టు సమాచారం.

కాగా, టీడీపీపై కాపుల వ్యతిరేక ప్రభావం లేదనే సంకేతాన్ని ఇటీవల జరిగిన నంద్యాల ఉపఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల ద్వారా తెలిసింది. ఈ ఎన్నికల తర్వాత కాపు శ్రేణుల్లో ఈ విషయమై విస్తృతమైన చర్చ జరుగుతోందని సమాచారం. చంద్రబాబు పాలనలో తమ సామాజిక వర్గానికి కూడా ఎంతో కొంత మేలు జరుగుతుందనే భావనలో కాపు శ్రేణులు ఉన్నట్టు తెలుస్తోంది. కాపు సామాజిక వర్గాన్ని కూడా దూరం చేసుకునే ఉద్దేశంలో చంద్రబాబు లేరని, ఆయనతో సయోధ్యగా ఉంటే తమ కులానికి మరింత మేలు జరుగుతుందని కాపు ఉద్యమ నేతలు భావిస్తున్నట్టు సమాచారం.

More Telugu News