: ‘అగ్రిగోల్డ్’ టేకోవర్ కు ముందు కొచ్చిన ఎస్సెల్ గ్రూపు

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో ‘అగ్రిగోల్డ్’ కేసు విచారణ ఈ రోజు జరిగింది. ‘అగ్రిగోల్డ్’ టేకోవర్ కు అనుమతి ఇవ్వాలని ఎస్సెల్ గ్రూపు ఈ సందర్భంగా హైకోర్టును కోరింది. టేకోవర్ కు అనుమతిస్తే నాలుగు నెలల్లోగా ‘అగ్రిగోల్డ్’ ను స్వాధీనం చేసుకుంటామని ఎస్సెల్ గ్రూపు కోరగా, ఎంత డిపాజిట్ చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ఇందుకు, ఎస్సెల్ గ్రూపు ‘ఆస్తుల వివరాలు తెలియకుండా, ఎలా డిపాజిట్ చేస్తాం. రూ.5, 10, 20 వేల లోపు డిపాజిట్లు ఎన్ని ఉన్నాయో తెలపాలి’ అని కోరింది. ఖాతాదారుల వివరాలు తమకు ఇవ్వాలని ఈ సందర్భంగా సీఐడీని హైకోర్టు ఆదేశించింది.ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 14కు వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు పేర్కొంది.

More Telugu News