ntr: చ .. చ .. చ .. చంపేశావ్ తారక్ : సాయిధరమ్ తేజ్

'జై లవ కుశ' నుంచి నిన్న సాయంత్రం ఒక ట్రైలర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. వ్యూస్ పరంగా .. లైక్స్ పరంగా ఈ ట్రైలర్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. ఎన్టీఆర్ పోషించిన మూడు పాత్రల పైన కట్ చేసిన ఈ ట్రైలర్ ఆయన అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక ఇండస్ట్రీకి చెందిన చాలామంది ప్రముఖులు ఈ ట్రైలర్ చూసి ఎన్టీఆర్ నటనను ప్రశంసిస్తున్నారు.

 ఈ సినిమాలో తనకి 'జై' పాత్ర నచ్చిందని హరికృష్ణ చెప్పారు. చాలామందిలో ఈ పాత్రనే ఆసక్తిని రేకెత్తిస్తోంది .. ఎక్కువ మార్కులు కొట్టేస్తోంది. ఇక సాయిధరమ్ తేజ్ కి కూడా ఈ పాత్రనే బాగా నచ్చేసినట్టుంది. ఈ ట్రైలర్ చూసిన ఆయన 'జై' పాత్రకి గల 'నత్తి'ని గుర్తుచేస్తూ .. "చ .. చ .. చ .. చంపేశావ్ తారక్ " అంటూ సరదాగా ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్ అభినయం .. ఈ ట్రైలర్ సూపర్ అనే విషయాన్ని తనదైన స్టైల్లో చెప్పాడు.      

More Telugu News