: వార్ ను వన్ సైడ్ చేయడమే నా లక్ష్యం: చంద్రబాబు

మరో ఏడాదిన్నరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల పోరును పూర్తి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా చేయడమే తన లక్ష్యమని, అందుకు ప్రతి కార్యకర్తా కృషి చేయాల్సి వుంటుందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా తెట్లంగిలో 'ఇంటింటికీ టీడీపీ'ని ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు, 2014 ఎన్నికల్లో 1.5 శాతం ఓట్లను అధికంగా తెచ్చుకుని టీడీపీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. ఆపై ఇటీవలి నంద్యాల ఎన్నికల్లో 16 శాతం ఓట్లను తెచ్చుకున్నామని, కాకినాడలోనూ ఘన విజయం సాధించామని అన్నారు.

 అభివృద్ధికి అడ్డు తగులుతున్న విపక్షాలకు ప్రజలే బుద్ధి చెబుతున్నారని, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను గురించి ప్రజలకు వివరించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు నాయకులు, కార్యకర్తలు ముందడుగు వేయాలని కోరారు. ఎటువంటి సమస్య ఉన్నా, తనతో చెప్పుకోవచ్చని, ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తాను కృతనిశ్చయంతో ఉన్నానని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకుగాను 175 స్థానాల్లోనూ విజయమే లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

More Telugu News