: రావూస్ స్కూల్ టీచర్ ప్రియాంక చేసింది అనైతిక చర్యే: డీఈఓ విజయకుమారి

రావూస్ స్కూల్ పీఈ టీచర్ ప్రియాంక, ఓ బాలిక స్కూల్ డ్రస్ వేసుకుని రాలేదన్న కారణంతో బాలుర టాయిలెట్లలో నిలబెట్టిన మాట వాస్తవమేనని రంగారెడ్డి జిల్లా డీఈఓ విజయకుమారి స్పష్టం చేశారు. మరో డీఈఓ సత్యనారాయణరెడ్డితో కలసి ఈ మధ్యాహ్నం స్కూలును సందర్శించిన ఆమె విచారణ చేపట్టి, జరిగిన ఘటనపై నివేదిక సిద్ధం చేశారు. ప్రియాంక చేసింది అనైతిక చర్యేనని, అందులో ఏమాత్రమూ సందేహం లేదని అన్నారు.

స్కూలు గుర్తింపును రద్దు చేయాలని తామేమీ సిఫార్సు చేయబోవడం లేదని, జరిగిన ఘటనపై నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నామని, చర్యలు తీసుకోవాలని మాత్రం సిఫార్సు చేయనున్నామని చెప్పారు. విద్యార్థినిని, ఆమె తల్లిదండ్రులను, స్కూల్ ప్రిన్సిపాల్ ను, ఆ సమయంలో క్లాసులో ఉన్న విద్యార్థినీ విద్యార్థులతో తాము మాట్లాడామని, బాలికను మూత్రశాల వద్ద నిలబెట్టిన విషయం వాస్తవమేనని తేలిందని అన్నారు.

More Telugu News