: క్యాబ్ డ్రైవ‌ర్‌తో బేరం చేసే అవ‌కాశం క‌ల్పిస్తున్న యాప్‌... ఊబెర్, ఓలాల‌కు కాంపిటీష‌న్‌?

క్యాబ్‌లు అన‌గానే గుర్తొచ్చేది... ఊబెర్‌, ఓలా యాప్‌లే. దాదాపు 50 శాతం క్యాబ్ స‌ర్వీస్‌ మార్కెట్‌ను ఈ రెండు కంపెనీలే ఏలుతున్నాయి అన‌డంలో అతిశ‌యోక్తి లేదు. అయితే ఈ కంపెనీల‌కు పోటీగా విహిక్ క్యాబ్స్ వచ్చింద‌ని మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. క్యాబ్ వినియోగ‌దారుల‌కు విహిక్ క్యాబ్స్ క‌ల్పించిన ఓ సదుపాయ‌మే వారి అంచ‌నాకు ప్ర‌ధాన కార‌ణం. ఊబెర్, ఓలా యాప్‌ల మాదిరిగా కాకుండా క్యాబ్ డ్రైవ‌ర్‌తో స్వ‌యంగా వినియోగ‌దారుడు బేరం చేసుకునే సౌక‌ర్యాన్ని ఈ యాప్ క‌ల్పించింది.

పీక్ టైమ్‌లో ఊబెర్‌, ఓలాలు స‌ర్జ్‌ప్రైస్ (అధిక ధ‌ర‌) పేరుతో వినియోగ‌దారుల జేబుల‌కు చిల్లుపెడుతున్నాయ‌ని చాలా ఫిర్యాదులు ఉన్నాయి. అలాంటి స‌మ‌యంలో విహిక్ క్యాబ్స్‌లో డ్రైవ‌ర్‌తో మాట్లాడుకుని ఒక ధ‌ర‌ను నిర్ణ‌యించుకునే అవ‌కాశం ఉంది. అంతేకాకుండా రేటింగ్ ఆధారంగా డ్రైవ‌ర్ల‌ను కూడా ఎంచుకునే స‌దుపాయాన్ని కూడా ఈ యాప్ క‌ల్పించింది. ఫేస్‌బుక్ మెసెంజ‌ర్‌లోని ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ చాట్ బోట్ ద్వారా ప‌నిచేసే ఈ క్యాబ్ స‌ర్వీస్ స్టార్ట‌ప్ కంపెనీని హైద్రాబాద్‌కు చెందిన దంప‌తులు దుడ్డు చైత‌న్య‌, స‌మీరా స్థాపించారు.

More Telugu News