sunil: మళ్లీ రీమేక్ లో చేయడానికి సునీల్ సిద్ధమవుతున్నాడా?

ఈ మధ్య కాలంలో కథానాయకుడిగా సునీల్ హిట్ కొట్టలేకపోయాడు. అయినా పట్టువదలని విక్రమార్కుడి మాదిరిగా తనవంతు ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన తాజా చిత్రంగా ఈ నెల 15వ తేదీన 'ఉంగరాల రాంబాబు' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో వైపున ఆయన మలయాళ మూవీ 'టూ కంట్రీస్' రీమేక్ లోను చేస్తున్నాడు.

ఈ సినిమా సెట్స్ పై ఉండగానే ఆయన మరో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడని టాక్ వినిపిస్తోంది. తమిళంలో 2014లో వచ్చిన 'సతురంగ వేట్టై'కి ఇది రీమేక్. 'రోమియో' ఫేమ్ గోపీ గణేశ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. గతంలో సునీల్ కి హిట్ తెచ్చిపెట్టిన 'అందాల రాముడు' .. 'తడాఖా' సినిమాలు రీమేకులే. అందువలన ఈ రీమేక్ కూడా తనకి బాగా కలిసొస్తుందని సునీల్ భావిస్తున్నాడట.    

More Telugu News