venkatesh: టీవీ షో దిశగా రావడానికి ఆసక్తిని చూపుతోన్న వెంకటేశ్?

ఇప్పుడు బుల్లితెరపై స్టార్ హీరోల హవా కొనసాగుతోంది. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఆయా టీవీ చానల్స్ స్టార్ హీరోలతో కార్యక్రమాలను రూపొందిస్తున్నాయి. ఆ హీరోలకు గల క్రేజ్ .. కొత్తదనంతో కూడిన కాన్సెప్ట్స్ ఆ చానల్స్ రేటింగ్ ను పెంచేస్తున్నాయి. నాగార్జున, చిరంజీవిలు టీవీ షోస్ కి వ్యాఖ్యాతలుగా తమ సత్తా చాటుకోగా, ప్రస్తుతం 'నెం.1 యారి' తో రానా, 'బిగ్ బాస్' తో ఎన్టీఆర్ దున్నేస్తున్నారు.

ఈ నేపథ్యంలో వెంకటేశ్ ను కూడా హోస్ట్ గా రంగంలోకి దింపడానికి కొంతమంది గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట. వెంకటేశ్ కూడా ఆసక్తిని చూపుతున్నట్టు సమాచారం. అయితే కార్యక్రమం భారీదై .. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా వుండాలని అంటున్నారట. కార్యక్రమం డిజైన్ విభిన్నంగా వుండాలని చెబుతున్నారట. ఈ విషయంలో ఆయనకి నచ్చే కాన్సెప్ట్ తగిలితే మాత్రం వెంకటేశ్ కూడా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తారన్న మాట.     

More Telugu News