Lavanya: సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం!

*  ఉత్తరాది బ్యూటీ లావణ్య త్రిపాఠీ టాలీవుడ్ లో పలు అవకాశాలు అందుకుంటూ తన కెరీర్ని కొనసాగిస్తోంది. ప్రస్తుతం గ్లామర్ ప్రధాన పాత్రలే పోషిస్తున్న ఈ ముద్దుగుమ్మకు డ్యాన్స్ ప్రధాన చిత్రంలో నటించాలని వుందట. చిన్నప్పుడు భరత నాట్యం నేర్చుకున్నానని, అలాంటి శాస్త్రీయ నృత్యం ఆధారంగా సాగే పాత్రను చేయాలని ఉందని ఈ చిన్నది చెబుతోంది.
*  ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన 'శ్రీవల్లి' చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిన్న రాత్రి హైదరాబాదులో జరిగింది. మెగా హీరో రామ్ చరణ్ దీనికి చీఫ్ గెస్ట్ గా విచ్చేశాడు. ఈ సందర్భంగా ట్రైలర్ ను ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ రిలీజ్ చేశారు.
*  మెగా హీరో సాయి ధరం తేజ్ నటిస్తున్న 'జవాన్' చిత్రం షూటింగ్ చివరి దశకు చేరింది. ప్రస్తుతం ఈ చిత్రం కోసం హీరో హీరోయిన్లు సాయి ధరం, మెహ్రీన్ కౌర్ లపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. బీవీఎస్ రవి దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు.  

More Telugu News