: ఫ్లోరిడాలోని భారతీయ అమెరికన్లు సేఫ్.. శిబిరాలు ఏర్పాటు చేసిన భారతీయ సంఘాలు

ఇర్మా తుపాను ధాటికి ఫ్లోరిడా ఖాళీ అయింది. ప్రజలు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఫ్లోరిడా వ్యాప్తంగా నివసిస్తున్న 1.20 లక్షల మంది భారతీయులు కష్టాల నడుమ సురక్షిత ప్రాంతాలకు చేరుకోవడంతో ముప్పు తప్పింది. తుపానులో చిక్కుకున్న భారతీయుల కోసం అక్కడి భారత రాయబార కార్యాలయం 24 గంటలూ పనిచేసే హెల్ప్‌లైన్ నంబరును ప్రారంభించింది. సీనియర్ అధికారుల పర్యవేక్షణలో అట్లాంటాలో పునరావాస కార్యక్రమాలు చేపట్టారు. రాయబారి నవతేజ్ సర్న పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.

భారత కాన్సుల్ జనరల్  సందీప్ చక్రవర్తి అట్లాంటా చేరుకుని కంట్రోలు రూములో ఉండి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. కింగ్‌స్టన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయంలోనూ హెల్ప్‌లైన్ ప్రారంభించారు. ఇక భారతీయుల కోసం ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంటా, గుజరాత్ సమాజ్ అట్లాంటా, హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా సంఘాలు పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశాయి. శిబిరాల్లో ఉన్న వారికి పలువురు భారతీయ వ్యాపారులు కూడా సహాయసహకారాలు అందిస్తున్నారు.

More Telugu News