: విమానాలు కొనండి, సరిపోతుంది: రవిశాస్త్రి కోరికపై కపిల్ దేవ్ సలహా

తీరికలేని షెడ్యూల్స్ కారణంగా భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు విశ్రాంతి లేకుండా గడుపుతున్నారని, సిరీస్ కు సిరీస్ కు మధ్య కనీసం రెండు వారాల గ్యాప్ ఇవ్వాలని హెడ్ కోచ్ రవిశాస్త్రి, బీసీసీఐ పెద్దలను కోరిన వేళ, ఆటగాళ్లకు విశ్రాంతి సమయాన్ని పెంచేందుకు సొంతంగా విమానాలు కొనాలని దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సలహా ఇచ్చారు.

బీసీసీఐ వద్ద తగినన్ని నిధులున్నాయని, వాటితో విమానాలు కొని, పార్కింగ్ ఫీజులు చెల్లించవచ్చని సూచించిన ఆయన, అప్పుడు ఆటగాళ్లకు మరింత విశ్రాంతి కూడా లభిస్తుందని తెలిపారు. ఈ విషయంలో బీసీసీఐ ఎప్పుడో నిర్ణయం తీసుకుని ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. వివిధ దేశాల్లో జరుగుతున్న టీ-20 పోటీలకు భారత ఆటగాళ్లను అనుమతిస్తే, అక్కడి వాతావరణం, పిచ్ లపై అనుభవం పెరుగుతుందని కపిల్ దేవ్ వ్యాఖ్యానించారు.

More Telugu News