: ఇంత బీభత్సం ఎన్నడూ చూడలేదు: తాజా హెచ్చరికలు జారీ చేసిన ఫ్లోరిడా గవర్నర్

హరికేన్ ఇర్మా గాలుల ఉద్ధృతి, కురుస్తున్న వర్షాలను చూసిన ఫ్లోరిడా గవర్నర్ రిక్ స్కాట్ తాజా హెచ్చరికలు జారీ చేశారు. అధికారుల ఆదేశాల మేరకు ఇళ్లు ఖాళీ చేసి, వారు సూచించిన చోటికి వెళ్లిపోవాలని ఆయన కోరారు. తన జీవితంలో ఎన్నడూ ఇటువంటి బీభత్సాన్ని చూడలేదని వ్యాఖ్యానించిన ఆయన, పూర్తి స్థాయి తుపాను తాకిన తరువాత తామేమీ చేయలేమని స్పష్టం చేశారు.

ఇప్పటికే వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారని, మిగిలినవారు మొండి పట్టుదలకు పోవద్దని సూచించారు. ముఖ్యంగా ఫ్లోరిడా పశ్చిమ తీరంలో తుపాను బీభత్సం చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని అన్నారు. కాగా, ప్రస్తుతం గంటకు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీస్తున్నాయని, ఇర్మా తుపాను ఫ్లోరిడాను తాకిందని మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి.

More Telugu News