: తెరచుకున్న సుంకేసుల గేట్లు... శ్రీశైలానికి భారీ వరద

ఈ సీజన్ లో తొలిసారిగా సుంకేసుల బ్యారేజ్ గేట్లు తెరచుకున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు భారీగా వరదనీరు వస్తుండటంతో ప్రాజెక్టు 3 గేట్లను ఎత్తిన అధికారులు, శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని వదులుతున్నారు. సుంకేసులకు 21 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా, 18 వేల క్యూసెక్కులను శ్రీశైలానికి, 2,500 క్యూసెక్కుల నీటిని కేసీ కెనాల్ కు వదులుతున్నారు.

మరోవైపు జూరాల ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో, వస్తున్న 30 వేల క్యూసెక్కుల నీటినీ దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలానికి 24 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా, సాయంత్రానికి అది మరింతగా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పెన్నా బేసిన్ లో కురుస్తున్న వర్షాలకు కండలేరు రిజర్వాయర్ కు 1,500 క్యూసెక్కుల వరదనీరు వస్తోంది. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో 640 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.

More Telugu News