: బులెట్ కాల్చితే వెనక్కు వచ్చేంత వేగంగా వీస్తున్న ఇర్మా గాలులు!

ఫ్లోరిడాను తాకుతున్న ఇర్మా తుపాను గాలుల ఉద్ధృతి ఎలా ఉందన్న విషయమై పోలీసులు తమ ట్విట్టర్ ఖాతాలో పెట్టిన ఓ పోస్టు వైరల్ అవుతోంది. గాలులకు ఎదురుగా నిలబడి బులెట్లను కాల్చవద్దని, అవి వెనక్కు తిరిగి వచ్చేంత బలంగా గాలులు ఉన్నాయని పాస్కో షరీఫ్ తన అధికారిక ట్విట్టర్ ఖతాలో పేర్కొంది. ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి, ఇర్మా తుపాను ఒత్తిడిని ఎదుర్కోవడానికి గాలులకు ఎదురుగా తుపాకి పేల్చి, తన ఊహ తప్పని తెలుసుకున్నాడని తెలిపింది.

రేయాన్ ఎడ్వర్డ్స్ (22) అనే యువకుడు చేసిన ఈ పనిపై 'యాహూ'లో వచ్చిన కథనాన్ని ఫార్వార్డ్ చేసింది. ఇక ప్రజలు తమ ఫోన్ లను పూర్తిగా చార్జింగ్ చేసి ఉంచుకోవాలని అది ప్రాణాలను కాపాడే ఆయుధం వంటిదని కూడా పాస్కో షరీఫ్ ప్రకటించింది.

More Telugu News