: రూ.424 కోట్ల లావాదేవీలు నిర్వహించిన 19 కంపెనీలపై సీబీఐ కొరడా.. పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారుల హస్తం!

మనీలాండరింగ్‌కు పాల్పడిన 19 కంపెనీలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కొరడా ఝళిపించింది.  ఆయా కంపెనీలు మొత్తం రూ.424 కోట్లను 700 లావాదేవీల ద్వారా విదేశాలకు పంపినట్టు ఆరోపణలున్నాయి. దీంతో ఈ 19 కంపెనీలపై సీబీఐ కేసులు నమోదు చేసింది.

ఈ మొత్తం లావాదేవీల వెనక చెన్నై మింట్ స్ట్రీట్‌లో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారుల హస్తం ఉందని అధికారులు భావిస్తున్నారు. 2015 నుంచి ఈ వ్యవహారం కొనసాగినట్టు అనుమానిస్తున్నారు. నిజంగా ఎటువంటి వ్యాపార లావాదేవీలు లేకపోయినా ఈ బ్యాంకు ఖాతాల నుంచి కోట్లాది రూపాయలు హాంకాంగ్‌లోని షెల్ కంపెనీలకు ట్రాన్స్‌ఫర్ అయినట్టు అధికారులు గుర్తించారు. అంతేకాదు విదేశాలకు డబ్బులు పంపేందుకే ఈ ఖాతాలను తెరిచినట్టు గుర్తించిన సీబీఐ కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.

More Telugu News