: గుర్మీతా? మజాకా?... రాసలీలల కోసం ఏర్పాటు చేసుకున్న మరో రెండు సొరంగాలు బట్టబయలు!

పైకి సర్వమూ త్యజించిన సన్యాసినని చెప్పుకుంటూ, ఆధ్యాత్మిక బోధనలు చెబుతుండే డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ అకృత్యాలు మరిన్ని వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు 800 ఎకరాల్లో ఉన్న డేరాలో మహిళలు నివసించే 'సాధ్వీ నివాస్'కు వెళ్లి వచ్చేందుకు గుర్మీత్ ఏర్పాటు చేసుకున్న రెండు కొత్త రహస్య సొరంగ మార్గాలు సోదాలు జరుపుతున్న అధికారుల కళ్లబడ్డాయి. ఫైబర్ తో నిర్మించిన ఈ రహస్య మార్గాల ద్వారా వెళ్లి వచ్చే గుర్మీత్, తనకు నచ్చిన వారిపై అత్యాచారాలకు పాల్పడేవాడని భావిస్తున్నారు.

ఇంకా డేరాలో బాణసంచా తయారీ కంద్రం, రసాయన పదార్థాలు, ఏకే-47 తూటాలకు సంబంధించిన ఖాళీ అర, టీవీ ప్రసారాలకు అవసరమయ్యే ఓబీ వ్యాన్, వాకీటాకీలు, నంబర్ లేని వాహనంతో పాటు మొత్తం 14 అస్థి పంజరాలు లభించాయి. వీటికి మరణ ధ్రువీకరణ పత్రాలు లేవని పోలీసులు తేల్చారు. ఆశ్రమంలో హత్యలు జరిగాయని వస్తున్న ఆరోపణలకు ఈ అస్థి పంజరాలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. సోదాలు ఆదివారం నాడు కూడా కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.

More Telugu News