: జీఎస్టీ రిటర్న్ లు దాఖలు చేయడానికి గడువు పొడిగింపు: హైదరాబాద్ లో అరుణ్ జైట్లీ

ఈ రోజు హైద‌రాబాద్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జీఎస్టీ స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా అరుణ్ జైట్లీ మీడియాతో మాట్లాడుతూ... జీఎస్టీ రిట‌ర్న్‌లు దాఖ‌లు చేయ‌డానికి అక్టోబ‌ర్ 10 వ‌ర‌కు గ‌డువును పొడిగిస్తున్న‌ట్లు తెలిపారు. జులై, ఆగస్టు నెలల్లో జీఎస్టీ కింద రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని, తాత్కాలిక పన్నుల కింద ఐజీఎస్టీ ఉపయోగించుకున్నారని అన్నారు.

చిన్న కార్ల‌పై అద‌న‌పు భారం ప‌డ‌కుండా చూడాల‌ని స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు అరుణ్ జైట్లీ చెప్పారు. వాటిపై జీఎస్టీ 48 నుంచి 43 శాతానికి దిగి వ‌చ్చింద‌ని చెప్పారు. పెద్ద కార్ల‌పై సెస్ 5 శాతం పెరిగింద‌ని, స్పోర్ట్స్ కార్ల‌పై 7 శాతం పెరిగింద‌ని అన్నారు. 1200 సీసీ పెట్రోల్‌, 1500 సీసీ డీజిల్ కార్ల‌పై య‌థాత‌థ స్థితి ఉంటుంద‌ని చెప్పారు. ఖాదీ వ‌స్తువుల‌కు జీఎస్టీ మిన‌హాయింపు ఇస్తున్న‌ట్లు చెప్పారు. అలాగే, జీఎస్టీ అమలులో ఇబ్బందులను ఎదుర్కొనేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు జైట్లీ తెలిపారు. 

More Telugu News