sasmyukta hegde: తెలుగు తెరకు మరో కొత్త హీరోయిన్ సంయుక్తా హెగ్డే!

ఈ మధ్యకాలంలో కన్నడలో వచ్చిన భారీ హిట్ చిత్రాలలో 'కిరిక్ పార్టీ' ఒకటి. కేవలం 4 కోట్ల రూపాయలతో నిర్మితమైన ఈ సినిమా, అక్కడ 50 కోట్ల వరకూ వసూలు చేసింది. ఈ సినిమాలో ఒక కథానాయికగా రష్మిక మందన నటించగా, మరో హీరోయిన్ గా సంయుక్తా హెగ్డే కనిపించింది. నిఖిల్ హీరోగా తెలుగులో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు.

 కన్నడలో సంయుక్త చేసిన పాత్ర కోసం చాలామంది హీరోయిన్ల పేర్లను పరిశీలించారట. కానీ ఈ విషయంలో నిఖిల్ అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం. కన్నడలో సంయుక్త చేసిన పాత్రకి తెలుగులోను ఆమెని తీసుకోవడమే మంచిదని .. ఆ పాత్రలో ఆమె జీవించిందని చెప్పాడట. దాంతో సంయుక్తను తీసుకున్నట్టు తెలుస్తోంది. తెలుగులో ఈ సినిమాతోనే ఈ అమ్మాయి పరిచయమవుతోంది. మంచి డాన్సర్ కూడా అయిన ఈ సుందరి, తెలుగులోను దుమ్ముదులిపేస్తుందేమో చూడాలి.  

More Telugu News